ఎన్ఐటీలో నాన్ టీచింగ్ రిక్రూట్‌మెంట్! 18 d ago
వరంగల్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ) లో డైరెక్ట్ /డిప్యూటేషన్ ప్రాతిపదికన మొత్తం 56 బేధనేతర సిబ్బంది పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. గ్రూప్- ఎ లో ప్రిన్సిపల్ సైంటిఫిక్ /టెక్నికల్ ఆఫీసర్ - 3, ప్రిన్సిపల్ స్టూడెంట్స్ యాక్టివిటీ అండ్ స్పోర్ట్స్ ఆఫీసర్ (ఎస్ఎఎస్) - 01, డిప్యూటీ రిజిస్ట్రార్ - 01, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ -1 , అసిస్టెంట్ రిజిస్ట్రార్ -1, అసిస్టెంట్ ఇంజినీర్-3 సూపరింటెండెంట్ -5, జూనియర్ ఇంజినీర్ -3, లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ -1, స్టూడెంట్స్ యాక్టివిటీ అండ్ స్పోర్ట్స్ అసిస్టెంట్ -1, సీనియర్ అసిస్టెంట్-8, జూనియర్ అసిస్టెంట్ -5, ఆఫీస్ అటెండెంట్ -10, ల్యాబ్ అసిస్టెంట్ -13 పోస్టులు ఉన్నవి.
విద్యార్హత పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో కనీసం 60 శాతం మార్కులతో బీఈ/బీటెక్, ఎమ్మెస్సీ, ఎంసీఏతో పాటు పని అనుభవముండాలి. వయసు 56 ఏళ్లు మించకూడదు. గ్రూప్ -ఎ పోస్టులకు ఫీజు రూ. 1000. గ్రూప్ -బి, గ్రూప్ -సి పోస్టులకు రూ. 500. ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగ/మహిళలకు ఫీజు మినహాయించారు. ఇంటర్వ్యూ, ధ్రవపత్రాల పరిశీలనల ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆన్‌లైన్ లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేది జనవరి 7. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.